22 మార్చి, 2010

వాసి - రాశి

మ్రాను వలెను ఒడ్డు పొడుగు
పెంచుకొనుట కాదు గొప్ప,
బూరుగెంత ఎదిగెనేమి
ఏమి ఫలము దాని వలన?


వికసించిన మల్లెపూవు
వాడిపోవు వేగముగా ,
అయిన నేమి అంతలోనే
వెదజల్లును పరిమళాలు !


కాకి వలెను కలకాలము
జీవించుట కంటే నీవు
హంస వోలె మంచి నెంచి
కొద్దికాల మున్న చాలు!


మంచి ముత్య మొకటే చాలు
తళుకు రాళ్ళు తట్టెడేల?
చెప్పెను కద మన వేమన,
రాశి కంటే వాసి గొప్ప!!

20 మార్చి, 2010

దైవ ప్రార్ధన

1    నీ పాద కమల సేవయు 
      నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం 
      తాపార భూతదయయును 
      తాపస మందార నాకు దయసేయగదే!


2 .  ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై 
      ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం 
     బెవ్వ డనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానే యైన వా
     డెవ్వడు , వానినాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్ !


3 . శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర 
     క్షాకారంభకు భక్తపాలన కళాసారంభ కున్ దానవో
     ద్రేక స్తంభకు గేళిలోల విలసద్ద్రుగ్జాల సంభూతనా   
     నాకంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !


4 . ఆతత సేవజేసేద సమస్త చరాచర భూతసృష్టి వి 
     జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్యవిధాతకు  వేదరాశి ని  
     ర్ణేతకు దేవతా నికరనేతకు గల్మష జేతకున్ నత
     త్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ !


5 . లావొక్కిం తయు లేదు ధైర్యము విలోలం బయ్యె ప్రాణంబులున్ 
    ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ 
    నీవే తప్ప నితః పరంబెరుగా మన్నింపం దగున్ దీనునిన్ 
    రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !