22 మార్చి, 2010

వాసి - రాశి

మ్రాను వలెను ఒడ్డు పొడుగు
పెంచుకొనుట కాదు గొప్ప,
బూరుగెంత ఎదిగెనేమి
ఏమి ఫలము దాని వలన?


వికసించిన మల్లెపూవు
వాడిపోవు వేగముగా ,
అయిన నేమి అంతలోనే
వెదజల్లును పరిమళాలు !


కాకి వలెను కలకాలము
జీవించుట కంటే నీవు
హంస వోలె మంచి నెంచి
కొద్దికాల మున్న చాలు!


మంచి ముత్య మొకటే చాలు
తళుకు రాళ్ళు తట్టెడేల?
చెప్పెను కద మన వేమన,
రాశి కంటే వాసి గొప్ప!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి